Mobile Popup Ad
Mobile Popup Ad

టికెట్ రేట్లపై వెనక్కి తగ్గిన ‘పెద్ది’ చిత్ర యూనిట్.. హైకోర్టులో పిటిషన్ విత్ డ్రా!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో టికెట్ రేట్ల పెంపుపై ‘పెద్ది’ ( Peddi) చిత్ర యూనిట్ వెనక్కి తగ్గింది. తెలంగాణలో వారం పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ విత్ డ్రా చేసుకుంది. అంతకుముందు ఈ మేరకు హీరో రామ్‌చరణ్‌ నటించిన ‘పెద్ది’ సినిమా టికెట్‌ రేట్లు పెంచే అంశంపై నిర్ణయం తీసుకునేలా హోంశాఖ ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు జారీచేయాలని కోరుతూ హైకోర్టులో చిత్ర యూనిట్ పిటిషన్ దాఖలు చేయగా.. టికెట్ రేట్ల పెంపుకు సానుకూలంగా ఉత్తర్వులు రాకపోవడంతో పిటిషన్ ను ఉపసంహరించుకుంది.

అయితే సినిమా టికెట్‌ రేట్లు పెంచాల్సి వస్తే 90 రోజుల ముందే ఆ అంశాన్ని పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలని, ఇప్పటికిప్పుడు సినిమా టికెట్ రేట్ల పెంపుపై ఎలాంటి ఉత్తర్వులు జారీచేయలేమని హైకోర్టు తెలిపింది. దీంతో పిటిషన్ ను చిత్ర యూనిట్ ఉపసంహరించుకుంది. ఇదిలాఉంటే జూన్ 4న రిలీజ్ కానున్న ఈ సినిమా టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 చొప్పున పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు కూడా వీలు కల్పించింది. అంతేకాదు ప్రీమియర్ షో టికెట్ ధర రూ.600గా నిర్ణయించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>