కలం, వెబ్ డెస్క్ : నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని (Tejaswini Nandamuri) తాజాగా తన ఎనర్జిటిక్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్‌తో కలిసి ఆమె వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆమె డ్యాన్స్‌లో గ్రేస్, ఎనర్జీ, కాన్ఫిడెన్స్ అద్భుతంగా కనిపిస్తున్నాయని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
గతంలో ఒక జువెలరీ బ్రాండ్ యాడ్‌లో మెరిసిన ఆమె, ఇప్పుడు నృత్యంతోనూ ఆకట్టుకోవడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. ఒకవేళ తేజస్విని సినిమాల్లోకి వస్తే తండ్రి బాలయ్య పేరును నిలబెడుతుందని నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బాలకృష్ణలో ఉన్న డ్యాన్స్ ఎనర్జీ కూతురిలో (Tejaswini Nandamuri) కూడా స్పష్టంగా కనిపిస్తోందంటూ ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం నందమూరి అభిమాన వర్గాల్లో ఒక ప్రత్యేక చర్చకు దారితీసింది.
-బాలయ్య కూతురు తేజస్విని డ్యాన్స్ పర్ఫార్మెన్స్!
-డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్
-తేజస్విని డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా!Nandamuri Balakrishana Daughter Tejaswini Energetic Dance Video Goes Viral!#TejaswiniNandamuri #NandamuriBalakrishna #BhanuMaster #TejaswiniDance… pic.twitter.com/09h0Uk159I
— Kalam Daily (@kalamtelugu) May 30, 2026
Read Also: డిన్నర్ తర్వాత పండ్లు తినడం మంచిదేనా? నిపుణుల హెచ్చరిక
Follow Us On : WhatsApp

