Mobile Popup Ad
Mobile Popup Ad

ఆయన ఎల్లప్పుడూ ప్రజాపక్షమే! : పవన్ కళ్యాణ్

కలం, వెబ్ డెస్క్ : మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావుకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు జాతికి ఎన్టీఆర్ చేసిన సేవలను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా స్మరించుకున్నారు. వెండితెరపైనే కాకుండా, రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారని కొనియాడారు. అంతేకాదు ఆయన రాజకీయాల్లో ఎల్లప్పుడూ ప్రజాపక్షమే వహించారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ (NTR) అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివని చెప్పారు. నిరుపేదల సంక్షేమం కోసం ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు, తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవని తెలిపారు. రూ.2కే కిలో బియ్యం పథకం ద్వారా పేదల ఆకలి తీర్చారన్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. ఆ స్ఫూర్తితో అన్నక్యాంటీన్లు పెట్టామని వ్యాఖ్యానించారు. భావితరాలకు ఆయనో నిఘంటువు అని ప్రశంసించారు.

Read Also: ‘పెద్ది’ గురించి రామ్ చరణ్‌ను అడిగిన ప్రధాని మోదీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>