Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా

కలం, వెబ్ డెస్క్ : కర్ణాటక రాజకీయాల్లో కీలక ఘట్టానికి తెరపడింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు లోక్ భవన్ లో రాజీనామా పత్రాన్ని సమర్పించారు. గవర్నర్ థావర్ చంద్ గేహ్లాట్ వ్యక్తిగత పర్యటన నేపథ్యంలో బెంగళూరులో లేకపోవడంతో గవర్నర్ కార్యదర్శికి రాజీనామా లేఖను అందజేశారు. ఈ సమయంలో సిద్ధ రామయ్య తో పాటు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ (DK Shivakumar) కూడా ఉన్నారు.

రాజీనామా నిర్ణయాన్ని ఈ రోజు బెంగళూరులోని తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన విందు సందర్భంగా తన మంత్రివర్గ సహచరులకు సిద్ధరామయ్య (Siddaramaiah) తెలియజేశారు. సీఎం పదవికి రాజీనామా చేయడాన్ని ఆయన అనుచరులు వ్యతిరేకిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం పదవి నుంచి వైదొలగాలని కోరింది. దీంతో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తదుపరి సీఎంగా డీకే శివకుమార్ ను ప్రకటించే అవకాశం ఉన్నది. డీకే ప్రమాణస్వీకారం చేసే వరకు సిద్ధ రామయ్య ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. రేపు (శుక్రవారం) శాసన సభ పక్ష సమావేశం జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Read Also: ‘పెద్ది’ గురించి రామ్ చరణ్‌ను అడిగిన ప్రధాని మోదీ

Read Also: పిల్లల్ని కనడం లేదు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>