కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: బక్రీద్ పండుగ ఐక్యతకు చిహ్నమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam) అన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌లో (Mahabubnagar) బక్రీద్ పండుగ సందర్భంగా న్యూ గంజ్ (New Gunj), రహమానియా ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని ఆయన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, బక్రీద్ పండుగ త్యాగానికి, నిస్వార్థ సేవకు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ పర్వదినం మనలో సేవాభావం, పరస్పర సహకారం వంటి విలువలను పెంపొందిస్తుందని చెప్పారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్నేహపూర్వకంగా, సహనంతో జీవించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారే పల్లి సురేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సిరాజ్ ఖాద్రీ, కార్పొరేటర్ షబ్బీర్ అహ్మద్ కొనసాగుతున్నారు.
Read Also: హైదరాబాద్‌లో నేపాలీల ఆగడాలు.. యువతి చేయి పట్టి
Read Also: పిల్లల్ని కనడం లేదు

