కలం, వెబ్ డెస్క్: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) 2025లో వీరమల్లు, ఓజీ సినిమాలతో వచ్చారు. ఈ ఏడాది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో రాబోతున్నారు. ఈ సినిమా నుంచి సాంగ్ రిలీజ్ చేస్తే యూట్యూబ్ షేక్ అయ్యింది. అయితే.. వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూడు సినిమాలను కంప్లీట్ చేశారు. ఇక పవన్, సురేందర్ రెడ్డితో సినిమా చేస్తానని ఎప్పుడో ప్రకటించారు. ఆ సినిమా ఉంటుందా? ఉండదా? అనేది సస్పెన్స్‌గా ఉండేది. న్యూయర్ వేళ ఆ సస్పెన్స్‌కి తెర పడింది. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న సినిమాని చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు.
కోలీవుడ్ డైరెక్టర్ సముద్రఖనితో పవన్ కల్యాణ్ బ్రో సినిమాని చేయడం.. ఆ సినిమా సక్సెస్ సాధించడం తెలిసిందే. అయితే.. ఈ మూవీ షూటింగ్ టైమ్‌లో సముద్రఖని (Samuthirakani) స్పీడు చూసి పవన్ ఫిదా అయ్యారట. అందుకనే మరో కథ రెడీ చేసుకో.. సినిమా చేస్తానని మాట ఇచ్చారట. ఆయన అలా చెప్పగానే కథ రెడీ చేసేసారట. స్టోరీ కూడా చెప్పారని బాగుంది చేద్దామని పవన్ మాట ఇచ్చారని టాక్. అందుకనే సముద్రఖని కూడా పవన్ డేట్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడట. కానీ ఇంతవరకు పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడో క్లారిటీ లేదు.
ఇప్పుడు సురేందర్ రెడ్డితో (Surender Reddy) సినిమాని ప్రకటించడంతో సముద్రఖని సినిమా ఏమైంది? అసలు ఉందా? లేదా? అనేది సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే.. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఒక సినిమానే చేస్తారని.. మళ్లీ పొలిటికల్‌గా బిజీ అవుతారని తెలిసింది. పార్టీ పై మరింత ఫోకస్ పెట్టడం కోసం పాలిటిక్స్ పైనే కాన్ సన్ ట్రేషన్ చేయాలి అనుకుంటున్నారట. ఇప్పుడు సురేందర్ రెడ్డితో సినిమా చేస్తే.. సముద్రఖనితో సినిమా ఏమౌతుంది అనేది తెలియాల్సివుంది. అయితే.. ఈ సినిమా పై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Read Also: “మన శంకర వరప్రసాద్ గారు” నుంచి బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..?
Follow Us On : WhatsApp


