epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

శ్రేయ గ్రూప్​ ఆస్తుల జప్తు.. సంస్థపై ప్రభుత్వ చర్యలు

కలం, వెబ్​ డెస్క్​ : కర్నూలు జిల్లాలో భారీ ఆర్థిక మోసానికి పాల్పడిన శ్రేయ గ్రూప్ (Shreya Group) సంస్థపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వేల సంఖ్యలో ఉన్న బాధితులకు న్యాయం చేసే దిశగా ఆ సంస్థకు చెందిన విలువైన ఆస్తులను జప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అధిక వడ్డీలు ఇస్తామంటూ సామాన్య ప్రజలను నమ్మించి కోట్లాది రూపాయల మేర మోసానికి పాల్పడిన శ్రేయ గ్రూప్ ఆస్తులను జప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఐడీకి అనుమతి ఇచ్చింది. ఈ కుంభకోణంపై విచారణ జరుపుతున్న సీఐడీ అధికారుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. శ్రేయ గ్రూప్ (Shreya Group) సంస్థ ఆకర్షణీయమైన స్కీములను ప్రవేశపెట్టి డిపాజిటర్లను బుట్టలో వేసుకుంది. కర్నూలులో ఆఫీస్​ పెట్టి వందలాది మందిని మోసం చేసింది. వీఐపీల పేర్లతో పెద్ద ఎత్తున నకిలీ స్కీంలు సృష్టించింది.

ప్రధానంగా రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు ఇస్తామని నమ్మించింది. ఈ క్రమంలో సుమారు 8,128 మంది డిపాజిటర్ల నుంచి సుమారు 206 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. వసూలు చేసిన సొమ్మును బాధితులకు తిరిగి చెల్లించకుండా సంస్థ యాజమాన్యం చేతులెత్తేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

డిపాజిటర్ల నుంచి సేకరించిన సొమ్మును సంస్థ నిర్వాహకులు సొంత అవసరాలకు మళ్లించారు. ఈ అక్రమ సంపాదనతో విలువైన భూములు, స్థిరాస్తులను కొనుగోలు చేశారు. ముఖ్యంగా సంస్థ అధినేత హేమంత్ కుమార్ మరియు అతని భార్య సంగీత రాయ్ పేర్లతో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సీఐడీ గుర్తించింది. కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలో ఉన్న 51.55 ఎకరాల భూమిని జప్తు చేసేందుకు ప్రభుత్వం తాజాగా సీఐడీకి అనుమతినిచ్చింది. ఈ ఆస్తుల విలువ మార్కెట్ ధర ప్రకారం కోట్లలో ఉంటుందని అంచనా.

Read Also: “మన శంకర వరప్రసాద్ గారు” నుంచి బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>