కలం, వెబ్‌డెస్క్: ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ (Trump Warns Iran) ఇచ్చారు. ఆయుధాలు లోడ్ చేసి పెట్టామని హెచ్చరించారు. ఇరాన్లో వారం నుంచి ప్రభుత్వానికి వ్యతిరేక ఆందోళనలు ఉద్ధృతంగా జరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం కారణంగా దేశంలో ఆర్థిక సంక్షోభం పెరిగిపోవడం, ఇరానియన్ రియాల్ విలువ దారుణంగా పడిపోవడంతో వ్యాపారులు, ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖొమేనీకి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిరసనకారులపై పోలీసులు కాల్పులకు దిగారు. దీంతో ఇప్పటివరకు సుమారు ఏడుగురు చనిపోయారు. దీనిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రూత్ సోషల్ మీడియలో ట్రంప్ పోస్ట్ చేశారు. ఖొమేనీ ప్రభుత్వం నిరసనకారులపై దమనకాండకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
‘శాంతియుతంగా నిరసనలు తెలిపే ప్రజలను కాల్చి చంపడం వాళ్ల విధానం కావచ్చు. కానీ, అమెరికా చూస్తూ ఊరుకోదు. నిరసనకారులను కాపాడడానికి రంగంలోకి దిగుతుంది. ఇప్పటికే ఆయుధాలను లాక్ చేసి, లోడ్ చేసి పెట్టి సిద్ధంగా ఉన్నాం. ఈ విషయాన్ని ఇరాన్ తెలుసుకుంటే చాలు’ అని ఆ పోస్ట్‌లో ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరించారు (Trump Warns Iran). కాగా, ఇరాన్లో ప్రభుత్వ, ఖొమేనీ వ్యతిరేక ఆందోళనలు రాజధాని టెహ్రాన్‌తోపాటు దేశంలోని అనేక నగరాలకు వ్యాపించాయి. వ్యాపారులు, వర్తక సంఘాలు మొదలుపెట్టిన ఈ ఆందోళనలకు విద్యార్థులు జత కలిశారు. వీరికి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించడంతో ప్రభుత్వం పోలీసులు, సైన్యం సాయంతో అణచివేయడానికి ప్రయత్నిస్తోంది.
Read Also: రెండు రాష్ట్రాల నీటి వివాదంపై కేంద్రం కీలక నిర్ణయం
Follow Us On: Sharechat


