కలం వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ,స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ ఫన్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు”. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ నుంచి సినిమా వచ్చి దాదాపు సంవత్సరం పైనే అవుతుంది. ఈ సినిమా కంటే ముందే మొదలు పెట్టిన “విశ్వంభర”. రిలీజ్ ఆలస్యం అవ్వడంతో మెగా ఫ్యాన్స్ అంతా ఈ సినిమాపైనే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ట్రైలర్‌ను జనవరి 4వ తేదీన విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాలో దర్శకుడు అనిల్ రావిపూడి తన మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు తోడుగా క్రైమ్ డ్రామా ఎలిమెంట్స్‌ను కూడా జోడించబోతున్నట్లు సమాచారం. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో చిరంజీవి (Chiranjeevi) లుక్ అదిరిపోయింది. మరి రిలీజ్ కాబోయే ట్రైలర్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Read Also: పవర్‌స్టార్‌తో.. ఆ డైరెక్టర్ మూవీ ఏమైంది?
Follow Us On: Youtube


