కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలకంగా మారారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతున్న నేపధ్యంలో జనసేన పార్టీని (Janasena) రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం పవన్ కల్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం పై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. త్వరలో హైదరాబాద్ లో జరిగే జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికలే టార్గెట్ గా జనసేనాని ముందుకు సాగుతున్నట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీకి మంచి జనాదరణ ఉంది. అయితే పవన్ కల్యాణ్ ఇన్నాళ్ళు తన పూర్తి సమయాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే కేటాయించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది. దీనితో తెలంగాణలో కూడా జనసేన పార్టీ సిద్దాంతాలను జనాలలోకి తీసుకెళ్లాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు జనసేనాని చర్యలు ప్రారంభించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది.

Read Also: హిల్ట్ పాలసీ భవిష్యత్ ఆరోగ్యానికి పునాది : మంత్రి శ్రీధర్ బాబు
Follow Us On: Youtube


