కలం, వెబ్డెస్క్: పొరుగు దేశం నేపాల్ (Nepal) లో మంగళవారం ఆందోళనలు చెలరేగాయి. భారత సరిహద్దుకు సమీపంలోని ధనుశా జిల్లాలో ఓ ప్రార్థన మందిరాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ఉద్రిక్తతలకు కారణమైంది. పర్సా, రహౌల్ తదితర ప్రాంతాల్లో ఓ సామాజిక వర్గం ఆందోళనలకు దిగింది. ఈ క్రమంలో ప్రత్యర్థి వర్గం వాళ్ల ఇళ్ళపై దాడులు జరిగాయి. దీంతో గొడవలు ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఈ ప్రాంతాలన్నీ సరిహద్దులోనివే కావడంతో భారత్ అప్రమత్తమైంది. వెంటనే సరిహద్దులను మూసివేసింది. అత్యవసర సర్వీసులకు తప్ప మిగిలిన అన్ని రాకపోకలపై నిషేధం విధించింది. కాగా, ఇప్పటికే మరో పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బంగ్లాలో అల్లరి మూకలు హిందువులపై దాడులకు తెగబడుతున్నారు. హత్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో నేపాల్ (Nepal) లోనూ మతపరమైన ఆందోళనలు చెలరేగడంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Read Also: యూకేలో అమెరికా దళాలు.. టార్గెట్ ఇరాన్?
Follow Us On : WhatsApp


