epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

హిల్ట్​ పాలసీ భవిష్యత్​ ఆరోగ్యానికి పునాది : మంత్రి శ్రీధర్​ బాబు

కలం, వెబ్​ డెస్క్​ : హిల్ట్​ పాలసీ (HILT Policy) భవిష్యత్​ తరాల ఆరోగ్యానికి పునాది అని మంత్రి శ్రీధర్​ బాబు అన్నారు. అసెంబ్లీలో హిల్ట్​ పాలసీపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. అభివృద్ధి పేరుతో పర్యావరణ విధ్వంసం ఆగాలన్నారు. మనం భూయజమానులం కాదు.. కేవలం ట్రస్టీలం మాత్రమేనని తెలిపారు. హిల్ట్ పాలసీలో ల్యాండ్​ కన్వర్షన్​ పై ఎలాంటి బలవంతం లేదు అని, పారిశ్రామికవేత్తలకు ఇష్టం అయితేనే ల్యాండ్ కన్వర్షన్​ చేయొచ్చని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు గోబెల్స్​ ప్రచారం చేస్తున్నాయని శ్రీధర్ బాబు విమర్శించారు. ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా జూబ్లీహిల్స్​ ఎన్నికల్లోనూ.. పంచాయతీ ఎన్నికల్లోనూ గెలిచామని శ్రీధర్​ బాబు గుర్తు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>