KKR vs PBKS.. వర్షంతో ఆగిపోయిన మ్యాచ్

కలం, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న KKR vs PBKS మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. ఈ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ తొలుత బ్యాటింగ్ దిగి 3.4 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 25 పరుగులు చేసిన సమయంలో వర్షం వచ్చింది. దీంతో మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. వర్షం తగ్గిన తర్వాత మ్యాచ్‌ను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. నిర్వాహకులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

ఈడెన్ గార్డెన్స్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని భావించి కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ ఎంచుకుకున్నాడు. కానీ భారీ టార్గెట్ ఇద్దామని బరిలోకి దిగిన కేకేఆర్ బ్యాటర్స్ కు పంజాబ్ బౌలర్లు ఝలక్ ఇచ్చారు. జేవియర్‌ సంధించిన అద్భుతమైన బంతికి (1.4) అలెన్‌ (6) వికెట్‌ కీపర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 12 పరుగుల వద్ద కోల్‌కతా తొలి వికెట్ కోల్పోయింది.మళ్లీ జేవియర్‌ బౌలింగ్‌లో (1.6) వికెట్‌ కీపర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి కామెరూన్‌ గ్రీన్‌ (4) పెవిలియన్ చేరాడు. దీంతో 16 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్‌కతా కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం జట్టు స్కోరు 25/2 ( 3.4) స్కోరు కాగా.. క్రీజులో రహానే 8, రఘువంశీ 7 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>