కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు (Patancheru) నియోజకవర్గ పరిధిలోని 48 ప్రభుత్వ పాఠశాలలు, 89 ప్రైవేటు పాఠశాలలో 2025 – 2026 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ ఫలితాలు సాధించిన 438 మంది విద్యార్థులకు 35 లక్షల రూపాయల సొంత నిధులతో కొనుగోలు చేసిన సైకిళ్లను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Mahipal Reddy) చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (Mahipal Reddy) మాట్లాడుతూ.. విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా ఉన్నత లక్ష్యాల సాధనకు మరింత ఉత్సాహం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం పదవ తరగతి విద్యార్థులకు మానసిక వికాస శిక్షణా తరగతులతో పాటు పరీక్షా సామాగ్రి పంపిణీ చేస్తూ వారికి అండగా నిలుస్తున్నామని తెలిపారు. అనంతరం ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు నగదు బహుమతులు సైతం పంపిణీ చేసినట్టు గుర్తు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుండి వినూత్నంగా సైకిళ్లు పంపిణీ (Bicycle Distribution) చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
Read Also: ప్లీజ్ ప్రధాని మోదీ.. ఈసారి తప్పు చేయొద్దు: రాహుల్ గాంధీ
Follow Us On: Instagram

