రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి.. నో చెప్పిన‌ కేంద్రం!

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా ఇప్పుడు ఐపీఎస్ అధికారుల కేటాయింపు సంఖ్యను పెంచాలని, అదనంగా 22 మందిని ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం ప్రతికూలంగా స్పందించింది. ప్రస్తుతం ఉన్న 151 పోస్టులే యథాతథంగా కొనసాగుతాయని, అదనంగా కేటాయించడానికి నిబంధనలు ఒప్పుకోవంటూ డీవోపీటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందినట్లు తెలిసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైమ్ 2015లో కేడర్ స్ట్రెంత్ రివ్యూ జరిగిందని, ఆ తర్వాత 2021లో జరగాల్సి ఉన్నప్పటికీ నాలుగేండ్ల ఆలస్యంగా 2025లో జరిగిందని, కేవలం ఏడుగురిని అదనంగా కేటాయించిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో నాలుగు నెలల క్రితం జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.

రాష్ట్ర జనాభా పెరగడం, డ్రగ్స్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ.. ఇలాంటి అవసరాలకు అదనపు ఐపీఎస్ అధికారులు కావాల్సి ఉంటుందని కేంద్ర హోం మంత్రికి సీఎం తెలిపారు. అయినా సానుకూల స్పందన రాలేదని సచివాలయ వర్గాల సమాచారం. నిబంధనల ప్రకారమే కేటాయింపు ఉంటుంది తప్ప అవసరాలకు తగ్గట్టు అదనంగా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ పరిధిలోని డీవోపీటీ (డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రెయినింగ్) వివరించినట్లు తెలిసింది.

ఫ్యూచర్ సిటీ, కొత్త కమిషనరేట్ల అవసరాలకు

– తెలంగాణకు ఐపీఎస్ పోస్టుల (Telangana IPS Posts) సంఖ్యను పెంచడంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో తదుపరి రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
– రాష్ట్రానికి మొత్తం 151 ఐపీఎస్ పోస్టులున్నా అదనంగా 22 ఇచ్చి 173కు పెంచాలని సీఎం గతంలో కోరారు.
– చివరిసారిగా 2025లో జరిగిన కేడర్ స్ట్రెంత్ రివ్యూ తర్వాత ఐపీఎస్ పోస్టుల సంఖ్య 139 నుంచి 151కు పెరిగింది. మొత్తం 151 మంది ఐపీఎస్‌ పోస్టులు ఉన్నా ఇందులో 83 మాత్రమే సీనియర్ డ్యూటీ పోస్టులు. గత రివ్యూ సందర్భంగా కేవలం ఈ కేటగిరీలో ఏడు పోస్టులే అదనంగా వచ్చాయి.
– తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ, వేగంగా విస్తరిస్తున్న అర్బనైజేషన్, సైబర్ నేరాల పెరుగుదల, కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు వంటి పరిణామాల నేపథ్యంలో ఐపీఎస్ అధికారుల సంఖ్యను పెంచాలన్నది సీఎం విజ్ఞప్తి. ప్రధానికి సైతం లేఖ ద్వారా రిక్వెస్ట్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>