కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా గుండాల మండలం శంభునిగూడెం గ్రామానికి చెందిన చాట్ల వనజ (Chatla Vanaja) ఆకస్మిక మరణం పట్ల పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు (Payam Venkateswarlu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన బాధితుల నివాసానికి వెళ్లి వనజ చిత్రపటానికి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే (Payam Venkateswarlu), వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చాట్ల వనజ మృతి అత్యంత బాధాకరమని, వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, అలాగే ఎమ్మెల్యే కోటాలో ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చాట్ల వనజ మరణానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్తయ్యతో పాటు కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also: ప్లీజ్ ప్రధాని మోదీ.. ఈసారి తప్పు చేయొద్దు: రాహుల్ గాంధీ
Follow Us On: Sharechat

