Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రారంభానికి నోచుకొని పటాన్ చెరు మ‌ల్టీ స్పెషలిటి ఆసుపత్రి

క‌లం, మెద‌క్ బ్యూరో : తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు (Patancheru) లో మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కోసం 16-07-2022 లో ఉత్త‌ర్వులు ఇచ్చింది. అసియా ఖండంలోనే రెండ‌వ అతిపెద్ద పారిశ్రామిక ప్రాంత‌మైన పటాన్ చెరులో 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు రూ.184 కోట్లు మంజూరు అయ్యాయి. ఇందులో రూ. 45 కోట్లు ఆసుపత్రి నూత‌న‌ భవన నిర్మాణంకి మంజూరు చేయగా, రూ. 25 కోట్ల ఆస్పత్రిలో అవ‌స‌ర‌మ‌య్యే వివిధ ర‌కాల వైద్య‌ పరికరాలకు కేటాయించారు. అయితే తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (Tgmsidc) వైద్య పరికరాల కొనుగోలు చేయవలసి ఉన్న, ఇప్పటి వరకు కూడా పూర్తిస్థాయిలో పరికరాలు రాలేదు.

సుమారు రూ. 114 కోట్లు వచ్చే 10 ఏండ్లకు ఆసుపత్రి నిర్వహణ ఖర్చు కోసం కేటాయించారు. ప‌టాన్ చెరువు మల్టీ స్పెషాలిటీ నిర్మాణాని సంబంధించిన పనులు ప్రారంభమై దాదాపు 4 ఏళ్లు గడిచింది. ప‌టాన్ చెరువు బ‌స్టాండ్ ద‌గ్గ‌ర ముంబాయి నేష‌న‌ల్ హైవేను అనుకొని నూత‌న భ‌వ‌న నిర్మాణం పూర్త‌యి ఏడాది గడుస్తుంది. 200 ప‌డ‌క‌ల ప్ర‌భుత్వ‌ మ‌ల్టీ స్పెషలిటి భ‌వ‌నాల నిర్మాణంను ఇంజనీరింగ్ విభాగం పూర్తి చేసి.. హెల్త్ డిపార్ట్మెంట్ కు నాలుగు నెలల కిత్రం అప్పగించింది. కొత్త‌గా అందుబాటులోకి వ‌చ్చే ప‌టాన్ చెరువు హ‌స్ప‌ట‌ల్ డాక్టర్స్ 58 మంది అవసరం ఉండగా 48 మంది మంజూరు అయ్యారు. ఇంకా 13 మంది డాక్టర్స్ ను నియమించా‌ల్సివుంది. హ‌స్ప‌ట‌ల్ పూర్తి స్థాయి నిర్వ‌హ‌ణ కోసం మొత్తం 179 మంది ఇత‌ర వైద్య‌ సిబ్బంది అవసరం ఉండగా, కేవలం 58 మంది మాత్రమే సాంక్షన్ అయ్యారు. ఇంకా 122 మంది నియామ‌కం ఇప్పటివరకూ జ‌ర‌గ‌లేదు.

ప్ర‌భుత్వ వైద్యానికి దూర‌మౌతున్న ప్ర‌జ‌లు

సంగారెడ్డి జిల్లాలో 4732 పరిశ్రమలు ఉన్నాయి. మినీ ఇండియాగా పేరుపొందిన పటాన్ చెరువు నియోజకవర్గం లో బ‌ల్క్ డ్ర‌గ్ , ఫార్మా , ఇంజనీరింగ్ తో పాటు వివిధ ర‌కాల పరిశ్రమలు ఉంటాయి. ప‌టాన్ చెరు ప్రాంతంలోని ప‌రిశ్ర‌మ‌ల‌ల్లో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తుంటారు. ఇక్క‌డి పారిశ్రామిక వాడల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు వ‌చ్చి ఉపాధి పొందుతుంటారు. దీంతో ప‌రిశ్ర‌మ‌ల నుండి వ‌చ్చే కాలుష్యంతో పాటు ప్ర‌మాద‌ల కార‌ణంగా ప్ర‌తియేడు వేలాది మంది అనార్యోగం బారిన ప‌డుతుంటారు. పొల్యూషన్ ద్వారా వచ్చే వ్యాధుల నయం చేయడం కోసం ప‌టాచ్ చెరువు హాస్పిటల్ ను ప్రత్యేకంగా మంజూరు చేశారు.

నాలుగు యేళ్లు కిత్రం మంజురైన ప‌టాన్ చెరువు మ‌ల్టీ స్పెష‌లిటి హ‌స్పిట‌ల్ ఇంకా అందుబాటులోకి రాక‌పొవ‌డంతో ఈ ప్రాంత ప్ర‌జ‌లు వైద్యం కోసం సంగారెడ్డి లేదా నిమ్స్, ఉస్మానియా, గాంధీ హ‌స్పిట‌ల్ వెళ్తున్నారు. అత్య‌వ‌స‌ర వైద్యం కోసం ప్రైవేట్ హ‌స్ప‌ట‌ల్స్ నే అనివార్యంగా అశ్ర‌యిస్త‌న్నారు. ప్ర‌భుత్వ అసుపత్రి నిర్మాణం పూర్తయినా వైద్యశాఖ‌ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు నాణ్యమైన వైద్యం కోసం హైద‌రాబాద్ లేదా ప్రైవేట్ హ‌స్ప‌ట‌ల్స్ కు వెళ్తన్నారు. ప‌రిశ్ర‌మ‌ల్లో ప్ర‌మాదాలు, ముంబాయి హైవే పైన ప్ర‌మాదాల కార‌ణంగా గాయపాలైన వారు స‌కాలంలో వైద్యం అందకపొవ‌డంతో ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితి ఏర్ప‌డింది. ప‌టాన్ చెరు ప్రాంతంలో పేద ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షలాగా మారింది.

ఓపెన్ చేయకపోతే డీఎంహెచ్ఓ ఆఫీస్ ముట్టడి : ఎమ్మెల్సీ అంజి రెడ్డి

సంగారెడ్డి జిల్లాకు చెందిన దామోదర రాజ‌న‌ర్సింహ్మ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ.. పటాన్ చెరులో 200 ప‌డ‌క‌ల ప్ర‌భుత్వ హాస్పిటల్ ప్రారంభం కాక‌పోవ‌డం భాద‌క‌ర‌మ‌ని ఎమ్మెల్సీ డా. చిన్న‌మైల్ అంజి రెడ్డి అన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో పేద ప్రజలు బలి అవుతున్నారని… అసుప‌త్రిలో నిర్మాణం పూర్త‌యిన‌ ఇంకా ప్రారంభం కాక‌పొవ‌డానికి కార‌ణ‌మేంట‌ని వైద్య అధికారులును ప్ర‌శ్నించారు. అధికారుల వ్య‌వ‌హ‌ర‌శైలి చూస్తే ప్రైవేట్ హ‌స్ప‌ట‌ల్స్ లతో కుమ్మక్కై ప్ర‌భుత్వ ధ‌వాఖ‌న‌ను ప్రారంభించ‌డం లేదనే అనుమానాలు ప్రజలనుంచి వస్తున్నాయన్నారు. సాక్ష‌త్తూ ఆరోగ్య శాఖ మంత్రి జిల్లాలో పేద‌ల‌కు ప్ర‌భుత్వ వైద్యం అంద‌ని ప‌రిస్ధితి ఎదురవడం దారుణమ‌న్నారు. వైద్య అధికారులు వెంట‌నే స్పందించి రానున్న‌ 15 రోజుల్లో పటాన్ చెరు లో మ‌ల్టీ స్పెషలిటి ప్రభుత్వ ఆస్పత్రి ఓపెన్ చేయకపోతే డీఎంహెచ్ఓ ఆఫీస్ ముట్టడిస్తామ‌ని ఎమ్మెల్సీ డా. చిన్న‌మైల్ అంజిరెడ్డి హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>