పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య(Padmasri Mogulaiah)కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR) భరోసా ఇచ్చారు. ఆయనకు ఉన్న ఇంటి స్థలం సమస్య, కంటి చికిత్స సమస్యలను పరిష్కరించే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. శనివారం కేటీఆర్‌ను ఆయన నివాసంలో మొగులయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగానే మొగులయ్యకు.. కేటీఆర్ భరోసా ఇచ్చారు. అయితే తనకు హయత్‌నగర్ ప్రభుత్వం కేటాయించిన 600 గజాల స్థలంలో కొందరు వ్యక్తులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కలెక్టర్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లిన తన సమస్య పరిష్కారం కాలేదని మొగులయ్య వివరించారు.
గత ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన భూమిని తనకు ఉచితంగా అందిస్తే దీన్ని కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని.. తాను కట్టుకున్న గోడలను ఇంటిని కూడా కులగోట్టారని, కోర్టు కేసులు వేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అండగా నిలవాలని కోరగా.. దీనిపై తక్షణమే స్పందించి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. మొగులయ్య భూమికి, ఆయన కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని సూచించారు. అవసరమైతే, మొగులయ్యకు ఎదురవుతున్న న్యాయపరమైన కేసులను ఎదుర్కొనేందుకు కూడా సహాయం అందిస్తామని కేటీఆర్( KTR) హామీ ఇచ్చారు.
Read Also: బీసీ బంద్‌లో కింద పడిపోయిన కాంగ్రెస్ నేత..

