జనగామ(Jangaon)లో జరిగిన బీసీ బంద్ ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ నాయకులు, బీసీ నాయకుల మధ్య భారీ ఘర్షణ జరగడంతో అక్కడ వాతావరణ వేడెక్కింది. మీడియా వారితో బీసీ నాయకులు మాట్లాడుతున్న క్రమంలో కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట రేవంత్ రెడ్డి(Revanth Reddy) బీసీలను మోసం చేశాడని మీడియాకు చెప్తుండగా, ఒక్కసారిగా బీసీ సంఘం నాయకుడు సంపత్‌పై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరి దీనిని కాంగ్రెస్, బీసీ జేఏసీ ఎలా చూస్తాయన్నది ప్రస్తుతం కీలకంగా మారింది.
Read Also: బీసీ బిల్లుపై ఇంకా పోరాడతాం: మహేష్ గౌడ్

