కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు గ్రాండ్ సక్సెస్ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) అన్నారు. తగ్గిన జీఎస్టీ ఫలాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. దాని ఫలితంగానే నవరాత్రుల్లో ఎలక్ట్రానిక్స్ అమ్మకాల్లో రికార్డ్ సృష్టించారని అన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నవరాత్రుల్లో ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు 25శాతం పెరిగినట్లు వెల్లడించారు. ఐఎంఎఫ్ వృద్ధి రేటు అంచనాలను 6.6 శాతానికి పెంచిందని అన్నారు. జీఎస్ 2.0పై కేంద్రమంత్రులతో నిర్వహించిన సమావేశంలో ఆమె ఈ విషయాలు వెల్లడించారు.
‘‘సెప్టెంబర్ 22న తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు(GST Reforms) వినియోగదారుల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. జీఎస్‌టీ 2.0 ద్వారా ఊహించిన దానికంటే ఎక్కువగా పన్నుల భారాన్ని ప్రజల నుంచి తగ్గించాం. అందుకే వాళ్లు ఆశించిన దానికన్నా ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నారు. అందుకు దసరా సమయంలో వారు రికార్డ్ స్థాయిలో చేసిన కొనుగోళ్లే నిదర్శనం’’ అని Nirmala Sitharaman వ్యాఖ్యానంచారు.
Read Also: మొగులయ్యకు కేటీఆర్ భరోసా.. సమస్య తీరుస్తానని హామీ

