శంషాబాద్ విమానాశ్రయం(Shamshabad Airport)లో భారీ మొత్తంలో గంజాయిని(Drugs) సీజ్ చేశారు అధికారులు. అధికారుల కళ్లుగప్పి లగేజ్ బ్యాగ్‌లో గంజాయిని తరలించే ప్రయత్నిం చేశాడు బ్యాంకాక్‌కు చెందిన ప్రయాణికుడు. బ్యాగ్‌ను తనిఖీ చేసిన విమానాశ్రయం అధికారులు.. 4.5 కేజీల విదేశీ గంజాయిని సీజ్ చేశారు. దాని విలువ రూ.4.5 కోట్లుగా అంచనా వేశారు. అయితే సదరు ప్రయాణికుడిపై కేసు నమోదు చేసినట్లు డీఆర్ఐ తెలిపింది. గంజాయిని ఇక్కడ ఎవరు రిసీవ్ చేసుకోనున్నారు? ఎవరు పంపారు? వంటి అంశాలపై దర్యాప్తు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Also: 71 మంది మావోయిస్ట్‌లు లొంగుబాటు..

