epaper
Tuesday, November 18, 2025
epaper

శివగామి పాత్ర చేయడం ఒక మ్యాజిక్ అన్న రమ్యకృష్ణ

బాహుబలి సినిమా అనగానే గుర్తొచ్చే పాత్రల్లో శివగామి(Sivagami) కూడా ఒకటి. ఆ పాత్రలో రమ్యకృష్ణ(Ramya Krishna).. బాగా నటించారు అనే కన్నా జీవించారు అంటే సరిగ్గా సూట్ అవుతుంది. ప్రతి సన్నివేశంలో కూడా శివగామి అంటే రమ్యకృష్ణయే గుర్తొస్తుంది. ఆ పాత్రలో ఇప్పుడు వేరేవారిని ఊహించుకోవాలన్న సాధ్యపడదు. అయితే తాజాగా ఆ పాత్ర గురించి రమ్యకృష్ణ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ పాత్ర తాను చేయడం ఒక మ్యాజిక్ అనే చెప్పాలని అన్నారు. జగపతిబాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ కార్యక్రమంలో తాజాగా రమ్యకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆమె బాహుబలి గురించి ఇంట్రస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగానే శివగామి పాత్రకు తొలుత శ్రీదేవిని అడగటంపైనా స్పందించారు.

‘‘బాహుబలి(Bahubali)లో నటిచండం నా అదృష్టం. కొన్ని మ్యాజిక్స్ అలా జరిగిపోతుంటాయి. అసలు శివగామి పాత్రకు ఫస్ట్ శ్రీదేవిని అడిగారని నాకు తెలీదు. కానీ ఆ పాత్ర నేను చేయడం నాకు దక్కిన అదృష్టం’’ అని Ramya Krishna అన్నారు.

Read Also: శర్వానంద్ ఇలా అయిపోయాడేంటి..?

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>