పోలీసుల ముందు లొంగిపోవడానికి మావోయిస్ట్‌లు(Maoists) క్యూ కడుతున్నారు. కేంద్ర కమిటీ సభ్యులు సైతం వరుసగా లొంగిపోతున్న క్రమంలో మిగిలిన నక్సలైట్లు కూడా జనజీవ స్రవంతిలో కలవడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఆదివారం 71 మంది నక్సలైట్లు ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లో పోలీసుల ముందు లొంగిపోయారు. వీరిలో జిల్లాలకు చెందిన డివిజన్ కమిటీల నాయకులు సహా కొందరు ముఖ్యులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాంకేర్(Kanker) ప్రాంతం నుంచి 50 మంది, నారాయణ్‌పూర్ జిల్లాలో 21 మంది లొంగిపోయారు. వీరిలో 13 మంది మహిళా నక్సల్స్ ఉన్నారు. లొంగిపోయిన నక్సలైట్లు 18 ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించారు.
Read Also: బీఆర్ఎస్ ఏకపక్షంగా నన్ను బయటకు పంపింది: కవిత

