యూఎస్‌లో 12 వేల మంది ఇండియ‌న్స్‌కి బిగ్ షాక్‌!

క‌లం, వెబ్ డెస్క్: అమెరికా టెక్ దిగ్గ‌జం ఒరాకిల్ (Oracle) ఉద్యోగుల‌కు ఊహించ‌ని షాకిచ్చింది. ఏకంగా ఒక్క‌రోజే 30 వేల లే ఆఫ్స్ (Layoffs) ప్ర‌క‌టించింది. వీరిలో 12 వేల మంది భార‌తీయులే (Indians) ఉండ‌టం గ‌మ‌నార్హం. బుధ‌వారం ఉద‌యం 6 గంట‌ల‌కే ఉద్యోగుల‌కు మెయిల్‌ ద్వారా టెర్మినేషన్ లెటర్స్ పంపించారు. సంస్థ వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో సిబ్బందిలో 18 శాతం మేర తగ్గించుకోవాలని నిర్ణ‌యించించుకుంది. ఈ లే ఆఫ్స్ చాల‌వ‌న్న‌ట్లు వ‌చ్చే నెలలో భారత్‌లో మరోసారి ఉద్యోగుల‌పై వేటు వేసేందుకు ఒరాకిల్ సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.

భారత్‌లో ఉన్న సుమారు 30,000 మంది ఉద్యోగుల్లో ఇప్పటికే దాదాపు 40 శాతం మంది ఈ లే ఆఫ్స్ బారిన పడ్డారు. ఒక్క‌ ఏడాది సర్వీసు పూర్తి చేసుకున్న వారికి 15 రోజుల జీతం, నోటీసు పీరియడ్ జీతం, అదనంగా రెండు నెలల జీతాన్ని టాప్ అప్‌గా ఇస్తామని కంపెనీ ప్రకటించింది. అయితే స్వ‌చ్ఛందంగా రాజీనామా చేసిన వారికే ఈ పరిహారం వర్తిస్తుందని నిబంధన విధించింది. అమెరికా వంటి దేశాల్లో స్థానిక చట్టాలు కఠినంగా ఉండటంతో, అక్కడ పని చేస్తున్న భారతీయులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందని మాజీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 16 గంటల పని వేళలపై నిరసన తెలిపిన వారిని కూడా కంపెనీ తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. కార్యకలాపాల పున‌రుద్ధ‌ర‌ణ‌ పేరుతో జరుగుతున్న ఈ మార్పులు ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

ప్రస్తుతం గ్లోబల్ ఐటీ రంగంలో నెలకొన్న అనిశ్చితి, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏప్రిల్ 2026 నాటికి ఐటీ రంగంలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒరాకిల్ యాజమాన్యం మాత్రం ఈ తొలగింపులపై (Oracle Layoffs) ఇంకా అధికారికంగా స్పందించలేదు.

 Read Also: పేరెంట్స్ బీ అలర్ట్.. పిల్లల్లో ఒబెసిటీకి ప్రధాన కారణాలివే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>