పేరెంట్స్ బీ అలర్ట్.. పిల్లల్లో ఒబెసిటీకి ప్రధాన కారణాలివే!

కలం, వెబ్ డెస్క్: నేటి బాల్యం (Childhood Obesity) అధిక బరువుతో ఇబ్బందులు పడుతోంది. కూర్చుంటే లేవలేరు.. లేస్తే కూర్చోలేరు. కనీసం నాలుగు అడుగులు వేయలేని పరిస్థితి నెలకొంది. పిల్లలు ఊహించనివిధంగా భారీకాయులుగా మారడానికి అనేక కారణాలుండొచ్చు. కానీ ఓ రెండు ప్రధాన కారణాలు మాత్రం పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. స్క్రీన్ టైమ్, జంక్ ఫుడ్ అలవాట్లే ముఖ్య కారణాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పిల్లలు గంటల తరబడి టీవీలు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోవడం వల్ల వారి శారీరక శ్రమ గణనీయంగా తగ్గిపోతోంది. దీనికి తోడు, పోషకాలు లేని కేలరీలు అధికంగా ఉండే జంక్ ఫుడ్ (Junk Food), ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరంలో అనవసరమైన కొవ్వు పేరుకుపోతోంది. ఈ జీవనశైలి మార్పులు పిల్లల్లో బరువు పెరగడమే కాకుండా చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి.

తల్లిదండ్రులు తమ పిల్లల ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ఈ రోజుల్లో చాలా అవసరం. ఇంట్లో వండిన పోషకాహారాన్ని అందించడం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఇచ్చేలా చూడటం ద్వారా ఊబకాయాన్ని (Childhood Obesity) అరికట్టవచ్చు. అలాగే పిల్లలను ఏదో ఒక శారీరక ఆట, వ్యాయామంలో పాల్గొనేలా ప్రోత్సహించాలి. స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయాలి. ఆరోగ్యకరమైన అలవాట్లను చిన్నప్పటి నుండే నేర్పించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి వారిని రక్షించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Read Also: శర్వానంద్ ‘బైకర్’కు ప్రభాస్ ప్రమోషన్.. వింటేజ్ లుక్ అదిరిందిగా

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>