కలం, వెబ్ డెస్క్ : గడ్డిమందు పారాక్వాట్ (Herbicide Paraquat) అమ్మకంపై పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన పారాక్వాట్ గడ్డి మందు అమ్మకాలు, వాడకంపై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం మార్చి 30, 2026న ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రంలో పారాక్వాట్ అమ్మకాలు, నిల్వలు , వినియోగంపై 60 రోజులు నిషేధం విధించింది. దీంతో నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) హెచ్చరికలు జారీ చేశారు.
క్షణికావేశంలో ఈ రసాయనం సేవించడం వల్ల జరుగుతున్న ప్రాణ నష్టాలు ఆందోళనకరంగా ఉంటున్నాయని మంత్రి తెలిపారు. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పారాక్వాట్ (Herbicide Paraquat) వంటి అత్యంత విషపూరిత రసాయనాల వినియోగం సుస్థిర, సహజ వ్యవసాయ విధానాలకు విరుద్ధమని వెల్లడించారు. గడ్డిమందు పారాక్వాట్ నిషేధం విధించాలని కాంగ్రెస్ నాయకులు పార్లమెంట్ లో ప్రస్తావించారని చెప్పుకొచ్చారు.
Read Also: వస్తున్నాం లింగమయ్యా.. నేటి నుంచే నల్లమల ‘సలేశ్వరం’ జాతర
Follow Us On: Instagram

