కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అభివృద్ధిలో మహిళలను భాగస్వాములను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. రాష్ట్రంలో మహిళా సాధికారతే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకంలో భాగంగా టీజీఎస్‌ఆర్‌టీసీ (TGSRTC) బస్సుల్లో మహిళలు 290 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి చేయడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా దాదాపు రూ.10,000 కోట్ల ప్రయాణ భారం తగ్గి, అది నేరుగా కుటుంబాల పొదుపుగా మారిందని చెప్పారు. ఈ 290 కోట్ల ఉచిత ప్రయాణాలు అనేవి రూ.10,000 కోట్ల ఆదా కావడం మాత్రమే కాదని.. అవి ఒక తల్లి మందుల ఖర్చు, ఒక కూతురు చదువుకు ఆసరా, ఒక పేద కుటుంబానికి ఆర్థిక భరోసా అని అన్నారు. ప్రజా భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
Read Also: రాష్ట్రంలో సమస్యలు తిష్ట… మంత్రుల కేరళం బాట..
Follow Us On: Sharechat

