విపక్షాలు తమ పద్దతులు మార్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) వ్యాఖ్యనించారు. అందుకు కావాలంటే తాను టిప్స్ ఇవ్వడానిక రెడీగా ఉన్నానని అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలు కానున్న సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. విపక్షాలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. గత పదేళ్లుగా ప్రతిపక్షాలు అనుసరిస్తున్న వ్యూహం ప్రజలకు ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించిన ఆయన, “వారు తమ వ్యూహాన్ని మార్చుకోవాలి. వారికి కొన్ని సూచనలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను’’ అని చురకలంటించారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు(Parliament Winter Session) ముందు పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వ పనిలో నిర్మాణాత్మక భాగస్వామ్యానికి విపక్షాలు ముందుకు రావాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. చట్టసభల్లో ఆరోగ్యకరమైన చర్చలు జరగాలని ప్రధానమంత్రి మరోసారి పునరుద్ఘాటించారు. “సభా సమయాల్లో డ్రామాలు వద్దు. నినాదాలతో వ్యవహారాలు అడ్డుకోవద్దు. జాతీయ ప్రయోజనాలపై సానుకూల చర్చలు జరగాలి. కొత్త ఎంపీలకు ఆదర్శం చూపేలా వ్యవహరించాలి’’ అని మోదీ(PM Modi) హితవు పలికారు.
దేశ అభివృద్ధి కోసం విపక్షాలు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి అని సూచించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలపై ప్రతిపక్షాల స్పందనను విమర్శిస్తూ, “పరాజయాన్ని అంగీకరించే మనసు విపక్షాలకు లేదు. ఓటమి నిరాశను అధిగమించి, ప్రజాస్వామ్యానికి తగిన విధంగా తమ బాధ్యతను నిర్వర్తించాలి’’ అని అన్నారు.
Read Also: హిల్ట్ పేరుతో సర్కార్ స్కామ్.. TG గవర్నర్‌కు ఫిర్యాదు
Follow Us On: X(Twitter)


