epaper
Wednesday, February 18, 2026
epaper

రాజ్యసభలో గందరగోళం.. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభ (Rajya Sabha)లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం ఉత్కంఠభరితంగా సాగింది. విపక్ష సభ్యుల నిరసనలు, నినాదాల మధ్యే ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో ప్రతిపక్ష సభ్యుల తీరుపై స్పందించిన ఆయన, ముందు తనను మాట్లాడనివ్వాలని, ఆ తర్వాత వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చని సూచించారు. సభలో గందరగోళం నెలకొన్నప్పటికీ, ప్రధాని ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

నిరసనల తీవ్రత పెరిగిన సమయంలో ప్రధాని మోడీ (PM Modi) విపక్ష నేత మల్లికార్జున ఖర్గేను (Mallikarjun Kharge) ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖర్గే వయసును గౌరవిస్తూ ఆయన నిలబడి నిరసన తెలపడం కంటే కూర్చుని నిరసన వ్యక్తం చేస్తే బాగుంటుందని ప్రధాని సూచించారు. ఖర్గే ఆరోగ్యం, వయసు దృష్ట్యా తాను ఈ సూచన చేస్తున్నానని చెబుతూనే, విపక్షాలు సభా మర్యాదలను పాటించాలని కోరారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు సభలో చర్చనీయాంశంగా మారాయి. కాగా మల్లికార్జున ఖర్గేకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి సభ్యులందరూ సభను బహిష్కరించి వాకౌట్ చేశారు.

Read Also: టాక్సీ రంగంలో కొత్త విప్లవం.. ఢిల్లీలో ‘భారత్ టాక్సీ’ సేవలు షురూ, తక్కువ ధరకే రైడ్స్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>