కలం, వెబ్ డెస్క్ : దేశంలో ప్రతిభావంతులైన యువతకు కొరత లేదని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అన్నారు. బడ్జెట్ పై రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో (Rajya Sabha) ప్రధాని ప్రసంగించారు. విపక్షాల నిరసనల మధ్యే ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా అడ్డు తగిలిన విపక్ష సభ్యులకు ముందు తనను మాట్లడనివ్వాలంటూ సూచించారు. తన వయసు దృష్ట్యా కూర్చొని నిరసన తెలపాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను మోడీ ఎద్దేవా చేశారు.
గతంలో ఇతర దేశాలు భారత్ తో ఒప్పందాలు చేసుకోవడానికి ముందుకొచ్చేవి అని, ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు కూడా మనదేశంతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయని మోడీ గుర్తు చేశారు. బీజేపీ హయాంలో అనేక సంస్కరణలు జరిగాయని, ఎన్డీఏ హయాంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని ఆయన (PM Modi) వెల్లడించారు.
Read Also: నాలుగు వారాల్లో కంప్లీట్ చేయండి.. డీజీపీ నియామకంపై ‘సుప్రీం’
Follow Us On: Instagram


