నరసరావుపేటలో భారీ అగ్నిప్రమాదం

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని పల్నాడు (Palnadu) జిల్లా నరసరావు పేట (Narasaraopeta) పట్టణంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. వినుకొండ రోడ్డులోని NSB కార్ డెకార్స్‌లో వెల్డింగ్ పని చేస్తుండగా ప్రమదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది కార్ సర్వీసింగ్ సెంటర్ నుంచి బయటకు పరుగులు తీశారు.

ఈ మంటలు చుట్టుపక్కల వ్యాపించడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో 3 ఫార్చునర్ కార్లకు మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>