Mobile Popup Ad
Mobile Popup Ad

చీలిక దిశగా సమాజ్‌వాదీ పార్టీ.. ముహూర్తం ఖరారైందా!

కలం, వెబ్ డెస్క్: దేశంలో మరో పార్టీలో చీలికకు ముహూర్తం ఖరారు అయిందా.. అంటే అవుననే అంటున్నారు యూపీ మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్. జూన్ 17న సమాజ్‌వాదీ పార్టీలో (Samajwadi Party) పెద్ద చీలిక రాబోతోందని, ఎస్పీ నేతలు బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అంతర్గత అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఉత్తరాది రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు వస్తున్నాయి. ఓం ప్రకాష్ వ్యాఖ్యలను సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) కొట్టిపారేశారు. తామంతా ఐక్యంగానే ఉన్నామని, 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు.

ఆయన మరో షిండే అవబోతున్నారా..?

సమాజ్‌వాదీ పార్టీకి (Samajwadi Party) ప్రస్తుతం రాజ్యసభలో నలుగురు క్రియాశీలక ఎంపీలు రామ్ గోపాల్ యాదవ్, జయా బచ్చన్, జావేద్ అలీ ఖాన్, రాంజీ లాల్ సుమన్ ఉన్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అందరి చూపు రామ్ గోపాల్ యాదవ్ మీద ఉంది. పార్టీకి కీలక వ్యూహకర్తగా పేరున్న రామ్ గోపాల్ యాదవ్ పార్టీని చీల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్ చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే.. ఆయన మరో ఏక్‌నాథ్ షిండే అవబోతున్నారా.. అనే వార్తలు యూపీ అంతటా వినిపిస్తున్నాయి. అదంతా బీజేపీ మైండ్ గేమ్ అని, ఇతర పార్టీల్లో చేసినట్లు సమాజ్ వాదీలో చేయాలంటే కుదరదని పార్టీ నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు.

Read Also: బ్యాన్‌ వ్య‌వ‌హారం.. ఢిల్లీ హైకోర్టుకు టెలీగ్రామ్‌!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>