Mobile Popup Ad
Mobile Popup Ad

విద్యుత్ ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆర్థిక సహాయం

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ (Narayankhed) నియోజకవర్గంలో విద్యుత్ ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి (MLA Sanjeeva Reddy) ప్రభుత్వం తరుఫున ఆర్థిక సహాయం అందజేశారు. 64 మంది విద్యుత్ ప్రమాద బాధితులకు మొత్తం రూ.48 లక్షల వరకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యుత్ షాక్ కారణంగా మృతి చెందిన నలుగురు వ్యక్తుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందించినట్లు తెలిపారు. అలాగే వ్యవసాయ క్షేత్రాల్లో విద్యుత్ ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయిన పశువుల యజమానులకు కూడా ఆర్థిక సహాయం అందించినట్లు పేర్కొన్నారు.

గత ఐదేళ్లుగా నష్టపరిహారం కోసం బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా, ఎవరూ పట్టించుకోలేదని ఎమ్మెల్యే (MLA Sanjeeva Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో తాను ప్రత్యేకంగా చొరవ తీసుకుని పరిహారం అందేలా కృషి చేసినట్లు చెప్పారు. రైతులు, ప్రజలు విద్యుత్ సరఫరా జరిగే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ పరికరాల వద్ద నిర్లక్ష్యం ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో అధికారులు పాల్గొన్నారు.

Read Also: రేవంత్ వార్నింగ్.. ఆఫీసర్లు డోంట్ కేర్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>