బ్యాన్‌ వ్య‌వ‌హారం.. ఢిల్లీ హైకోర్టుకు టెలీగ్రామ్‌!

క‌లం, వెబ్ డెస్క్: నీట్ (NEET) ప‌రీక్ష నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం టెలీగ్రామ్‌ (Telegram) యాప్‌పై తాత్కాలిక నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేంద్ర‌ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ టెలీగ్రామ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించింది. బ్యాన్‌ను వ్య‌తిరేకిస్తూ కోర్టులో అత్యవసర పిటిష‌న్ దాఖ‌లు చేసింది. కోర్టు అంగీకరించడంతో నేడు ఈ పిటిష‌న్ విచార‌ణ‌కు రానుంది. జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్ జ‌రుగ‌నుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మ‌రంగా కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికే విద్యార్థుల‌కు హాల్‌టికెట్స్ కూడా విడుద‌ల చేశారు. ఇటీవ‌ల పేప‌ర్ లీక్ వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా సృష్టించిన దుమారాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం టెలీగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధాన్ని విధించింది. ఈ నేప‌థ్యంలో కోర్టు ఎలాంటి తీర్పునిస్తుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Read Also: హైదరాబాద్‌లో టెస్లా.. ఏఐ స్పెషల్ కార్లు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>