Mobile Popup Ad
Mobile Popup Ad

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అధికారుల బృందం

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు గురువారం జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీకాంత్ రెడ్డి, డీఎం సిఎస్‌సి ప్రవీణ్, ఏసీఎస్ఓలు కలిసి డొంకేశ్వర్ సొసైటీ పరిధిలోని నడ్కూడ, గాదెపల్లి, ఉమ్మెడ ధాన్యం కొనుగోలు కేంద్రాల (Paddy Procurement Centers)ను పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జీలకు ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయడంతో పాటు నిల్వ ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాల‌ని ఆదేశించారు. ట్యాబ్ ఎంట్రీలను సకాలంలో పూర్తి చేయడం, ఈ నెల 30వ తేదీ నాటికి ధాన్యం సేకరణ పూర్తి చేసి కొనుగోలు కేంద్రాలను మూసివేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. అలాగే బ్యాక్ వాటర్‌లో మునిగిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయరాదని స్పష్టమైన సూచనలు చేశారు.

అనంతరం నందిపేట్ మండలం జోర్పూర్ గ్రామంలోని పూర్ణిమా పారా బాయిల్డ్ రైస్ మిల్లును సందర్శించి, మిల్లుకు చేరుతున్న లారీల అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. మిల్లర్ అంగీకార ప్రక్రియను ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని మిల్ యాజమాన్యాన్ని ఆదేశించారు.

Read Also: ‘పెద్ది’లో మాస్ ట్విస్ట్.. దివ్యేందు శర్మ షాకింగ్ కామెంట్స్

Read Also: పిల్లల్ని కనడం లేదు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>