కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ (Hyderabad)లో ఓ పోలీస్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో వ్యవహరించి చావుబతుకుల్లో ఉన్న ఒక విద్యుత్ కార్మికుడి ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. అసిస్టెంట్ లైన్‌మ్యాన్‌గా పనిచేస్తున్న రాజు నాయక్ అనే విద్యుత్ కార్మికుడు, ఓ స్తంభంపై ఎక్కి పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ హైటెన్షన్ వైర్ తగిలింది. దీంతో అతడు ఒక్కసారిగా కిందపడి పోయాడు. షాక్ తీవ్రతకు రాజు నాయక్ గుండె స్పందన ఆగిపోయింది. అయితే ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న టప్పాచబుత్రా పోలీస్ కానిస్టేబుల్ సురేశ్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాజు నాయక్ కు వెంటనే సీపీఆర్ (CPR) చేశాడు.
ఈ క్రమంలోనే కొద్దిసేపటికే రాజు నాయక్ తిరిగి ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత స్థానికుల సహాయంతో బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజు నాయక్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కానిస్టేబుల్ సురేష్ సకాలంలో చేసిన సీపీఆర్ (CPR) వల్లే రాజు నాయక్‌కు ప్రాణాపాయం తప్పిందని, లేదంటే ఊపిరి దక్కేది కాదని వైద్యులు వెల్లడించారు.
Read Also: ‘పెద్ది’లో మాస్ ట్విస్ట్.. దివ్యేందు శర్మ షాకింగ్ కామెంట్స్
Read Also: పిల్లల్ని కనడం లేదు

