Mobile Popup Ad
Mobile Popup Ad

‘పెద్ది’లో మాస్ ట్విస్ట్.. దివ్యేందు శర్మ షాకింగ్ కామెంట్స్

కలం, సినిమా : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan), టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చి బాబు సనా కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది'(Peddi). జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమాకి మేకర్స్ భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. నేడు ఢిల్లీలో గ్రాండ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్‌లో నటుడు దివ్యేందు శర్మ (Divyendu Sharma) ‘పెద్ది’ సినిమాపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘పెద్ది’ కేవలం స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదని, ఇందులో ఒక వైవిధ్యమైన ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా ఉందని ఆయన రివీల్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్ మధ్య లవ్ ట్రాక్‌తో పాటు, తన పాత్రకు కూడా ప్రత్యేకమైన లవ్ స్టోరీ ఉందని దివ్యేందు (Divyendu Sharma) తెలిపారు. అయితే అది చాలా టాక్సిక్‌గా ఉంటుందని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే సినిమాలో తన పాత్ర చరణ్‌కు ఎదురుగా నిలిచే పవర్‌ఫుల్ విలన్ లేదా రైవల్‌గా ఉంటుందని హింట్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు అభిమానులలో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.

Read Also: ‘పెద్ది’ గురించి రామ్ చరణ్‌ను అడిగిన ప్రధాని మోదీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>