Mobile Popup Ad
Mobile Popup Ad

దివ్యాంగుడిని మోసం చేసిన ఐఏఎస్ ఆఫీసర్.. రూ.95 లక్షలు తీసుకుని బెదిరింపులు

కలం, వెబ్ డెస్క్ : ప్రజలకు సేవ చేయాల్సిన అత్యున్నత పదవిలో ఉన్న ఓ ఉన్నతాధికారిణి దివ్యాంగుడిని మోసం చేసిన ఘటన ఒడిశా (Odisha)లో చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర హోం శాఖ అదనపు కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఆరాధన దాస్ భూమి ఇప్పిస్తానని ఓ వ్యక్తి నుంచి రూ. 95 లక్షలు తీసుకుంది. ఆ తరువాత బాధితులు ప్రశ్నించగా చంపుతానని వారిని బెదిరించింది. దివ్యాంగుడైన కమల్ కుమార్ భావ్ సింకాను కటక్ జిల్లా సీడీఏ ప్రాంతంలో భూమి ఇప్పిస్తానని చెప్పి ఐఏఎస్ అధికారిణి ఆరాధన దాస్ మోసగించింది.

కమల్ కుమర్ తో పాటు ఆయన భార్య బ్యాంకు ఖాతాల నుంచి ఆరాధన దాస్ రూ.95 లక్షలు తీసుకుంది. భూమి ఇప్పించకోవడంతో డబ్బులు ఇవ్వాలని ఐఏఎస్‌ను బాధితులు కోరారు. అయితే, డబ్బులు ఇవ్వకుండా వారిని చంపుతానంటూ బెదిరింపులకు దిగింది. దీంతో కమల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన అధికారులు ఆరాధన దాస్ డబ్బులు తీసుకున్నట్లు నిరూపీతమైంది. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఐఏఎస్ అధికారిణిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఒడిశా (Odisha) రాష్ట్ర హోం శాఖ, సాధారణ పరిపాలన శాఖకు లేఖ రాశారు. ఆరాధన దాస్ గతంలో భూమి, గృహనిర్మాణ రంగంలోని పలు శాఖల్లో విధులు నిర్వహించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>