లక్ష రాక్షసుల ఆలోచనలు కలిస్తే చంద్రబాబు: సజ్జల

కలం, వెబ్ డెస్క్: లక్ష రాక్షసుల ఆలోచనలు కలిస్తే చంద్రబాబు అవుతాడని వైయ‌స్సార్సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) తీవ్రంగా మండిపడ్డారు. దోపిడీ, దగా, మోసానికి పరాకాష్ట చంద్ర‌బాబు కూట‌మి పాల‌న‌ అంటూ విరుచుకుపడ్డారు. “చంద్ర‌బాబు వెన్నుపోటు పాల‌న‌కు రెండేళ్లు” పేరుతో తాడేప‌ల్లి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆదివారం నిర్వ‌హించిన‌ వైయ‌స్సార్సీపీ మ‌హిళా విభాగం రాష్ట్ర స్థాయి స‌మావేశానికి సజ్జల ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌స‌గించారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో ఎక్కువ‌గా న‌ష్ట‌పోయింది మ‌హిళ‌లేనని ఆరోపించారు.

రాష్ట్రంలో ఉన్న‌వి ఊడ‌పీకేసి, రెండేళ్ల‌లో నిలువుదోపిడీ చేశాడని మండిపడ్డారు. వైయ‌స్సార్సీపీ హ‌యాంలోనే 50 శాతం రిజర్వేషన్లు అమ‌లు చేశామని.. అయినా ఇప్పుడు మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు అంటూ బ‌రితెగించి అబ‌ద్ధాలు మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. “చంద్రబాబే ఓ గోబెల్స్ బాస్. ఇతరుల్ని ఎస్కో బార్ అంటాడు, ఆయనే పెద్ద ఎస్కో బార్. ఓ నక్క, హైనా, తోడేలు ఆలోచనలు కలిస్తే చంద్రబాబు” అంటూ విరుచుకుపడ్డారు.పార్టీ మ‌హిళా విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలు వ‌రుదు క‌ళ్యాణి మాట్లాడుతూ.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తానంటున్న లోకేష్ కి చిత్తశుద్ది ఉంటే ఇప్పుడు రాజ్యసభ సీట్లు, ఎమ్మెల్సీ సీట్లలో ఇవ్వొచ్చు కదా! అంటూ విమర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>