కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి (Suvendu Adhikari) తన నూతన మంత్రి వర్గ విస్తరణకు సిద్ధమయ్యారు. రేపు ఉదయం 11 గంటలకు కోల్‌కతాలోని లోక్‌భవన్‌లో పూర్తిస్థాయి కేబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు సువేందు ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. మొత్తం 35 మంది మంత్రులు ఈ వేడుకలో బాధ్యతలు స్వీకరించనుండగా , గవర్నర్ ఆర్ఎన్ రవి వారితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సువేందు అధికారి, బెంగాల్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఈ నూతన మంత్రివర్గం అంకిత భావంతో పని చేస్తుందని ఆయన వెల్లడించారు.

