కలం డెస్క్ : వెనిజులా దేశానికి చెందిన మరియా కొరీనా ఈ సంవత్సరానికి (2025)గాను నోబెల్ శాంతి బహుమతి(Nobel Peace Prize)కి ఎంపికయ్యారు. అనేక దేశాల నుంచి మొత్తం 330 మందికి పైగా ఈ పురస్కారం కోసం దాఖలు చేసుకోగా అందులో జ్యూడీ అకాడమీ కమిటీ మరియా కొరీనా మచాడోను నామినేట్ చేసింది. ప్రజాస్వామిక హక్కుల కోసం చేసిన పోరాటానికి గుర్తింపుగా ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు కమిటీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగానే ఈ పురస్కారం అత్యున్నతమైనది, ప్రతిష్టాత్మకం కావడం గమనార్హం. వివిధ దేశాల మధ్య యుద్ధాలను ఆపి శాంతిని స్థాపించినందుకు తనకు నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భావించినా ఆయన ఆశలు అడియాశలయ్యాయి. ఆయన చేసిన ప్రయత్నాలు ఆశాజనకమైన ఫలితాలను ఇవ్వలేకపోయాయి.
వెనిజులా దేశానికి చెందిన మరియా అక్కడ ప్రజాస్వామిక స్ఫూర్తి, ప్రజల హక్కుల కోసం వివిధ రూపాల్లో పోరాటాలు చేశారని, ఆమె అవిశ్రాంత పోరాటాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ పురస్కారానికి నామినేట్ చేసినట్లు నోబెల్ పీస్ ప్రైజ్(Nobel Peace Prize) అకడమిక్ కమిటీ పేర్కొన్నది. నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఆమె సాహసోపేతంగా పోరు సరిపారని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శాంతి మార్గంలోనే ఆమె కృషి చేశారని కమిటీ గుర్తుచేసింది. ఆమె తన పోరాటంలో అనేక ఒత్తిడులను, బెదిరింపులను కూడా ఎదుర్కొన్నారని, చివరకు కొంత కాలం పాటు అజ్ఞాత జీవితానికీ వెళ్ళాల్సి వచ్చిందని గుర్తుచేసింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఆమెను పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నుకున్నారని, ఆ దేశ రాజకీయాల్లో విపక్ష నాయకురాలిగానూ వ్యవహరించారని, ఆ దేశ ప్రభుత్వం అవలంబిస్తున్న మిలిటరైజేషన్ ప్రక్రియను తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారని, ప్రజాస్వామ్య స్థాపన కోసం ప్రజాస్వామిక పద్ధతుల్లోనే పోరాడి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని కమిటీ కొనియాడింది.
Read Also: స్మృతి మందాన.. చేసింది తక్కువ స్కోరే అయినా రికార్డ్..!

