BPD Symptoms | బీపీడీ(బోర్డర్‌లైన పర్సనాలిటీ డిజార్డర్) ఇది చాలా ప్రమాదకరమైంది మానసిక నిపుణులు చెప్తున్నారు. ఇది భావోద్వేగాలను నియంత్రించే సమార్థ్యాన్ని దెబ్బతీస్తుంది. మనిషి మానసిక ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. బీపీడీతో బాధపడే వారు ఎవరితోనూ సరైన సంబంధాలను కొనసాగించలేరు. వీరు తరచుగా తమను తాము తక్కువ చేసుకుని, న్యూనతా భావంతో ఇబ్బంది పడుతుంటారు. తాము ఎవరికీ అవసరం లేదన్న భావనతో ఉంటారు. ‘నేను లేకపోయినా ఈ ప్రపంచంలో ఏమీ మారదు. అసలు తను ఉన్నా లేకపోయినా ఎవరికీ ఫరక్ పడదు’’ అన్న భావన వీరిలో అధికంగా ఉంటుంది. వీరిలో భావాలు తీవ్రస్థాయికి తీసుకెళ్లే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
బీపీడీతో బాధపడే వారు తమకు తాము హాని చేసుకోవాలన్న ఆలోచనలను కలిగి ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో వారికి విపరీతమైన ఆత్మహత్య ఆలోచనలు కూడా వస్తాయని అంటున్నారు. దీనికి కచ్ఛితమైన కారణం ఇప్పటి వరకు కనుగొనలేదని, కానీ దీనికి చిన్నతనంలో అనుభవించిన ట్రామా బలమైన కారణం కావొచ్చని నిపుణులు అంటున్నారు.
BPD Symptoms | బాల్యంలో చిన్న పిల్లల మనసుకు తగిలే గాయాలు వారికి జీవితాంతం గుర్తిండిపోతాయి. అది వారి భావోద్వేగ, మానసిక ఆరోగ్యంపై శాశ్వత ప్రభావాలను చూపుతాయి. వారి పర్సనాలిటీపై కూడా శాశ్వత ముద్ర వేస్తాయి. దీనికి చిన్న తనంలో నిర్లక్ష్యానికి గురికావడం, శారీరక వధింపులు, లైంగిక వేధింపులు, భావోద్వేగాలను దుర్వినియోగ పరచడం, ఇంటిలో హింసను చూడటం, లేదా మానసిక అనారోగ్యం ఉన్న తల్లిదండ్రులు వంటివి కారణాలు కావొచ్చని నిపుణులు వివరిస్తున్నారు.
Read Also: విటమిన్-Dకి మెదడుకు లింకేంటి..?

