సినిమాల్లో బోల్డ్ సీన్స్‌లో నటిస్తే తప్పేంటి? అని బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్(Janhvi Kapoor) క్వశ్చన్ చేసింది. ఈ రోజుల్లో బోల్డ్ సీన్స్ అనేది చాలా కామన్ అయిపోయిందని, దాన్నెందుకు తప్పుగా చూడాలి? అని నిలదీసింది. అయితే బోల్డ్ సీన్స్ చేస్తే తప్పా? ఒప్పా? దాని వల్ల లాభం ఏంటి? డబ్బుల కోసం ఒళ్లు చూపించాలా? ఇలాంటి ప్రశ్నలు సినీ ఫీల్డ్‌లో ఎన్నో సందర్భాల్లో వినిపించాయి. వీటికి హీరోయిన్లు కూడా ఒక్కొక్కరు ఒక్కోలా సమాధానాలు ఇచ్చారు. కొందరు.. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే చేయాల్సి వస్తుందంటారు. మరికొందరేమో తమకు పర్సనల్‌గా ఇష్టం లేదని, కానీ కథ కోసమే చేస్తున్నామని వివరిస్తున్నారు. ఇంకొందరమే బోల్డ్ సీన్లు చేస్తేనే సంపూర్ణ నటిగా గుర్తింపు వస్తుందని, అలాంటి సీన్లను కూడా అద్భుతంగా పండించడం మన నటనను చూపుతుందని అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జాన్వీ కూడా తన ఆసక్తికర కామెంట్స్ చేసింది.
‘‘బోల్డ్ అనే పదాన్ని సమాజం మొదటి నుంచి తప్పుగా చెప్తూ వచ్చింది. అందుకే ఆ సీన్లలో నటిస్తే వేరే చూస్తున్నారు. అది ఏమాత్రం సరైన పద్దతికాదు. బోల్డ్ సీన్లలో నటించినా సరే ఎంకరేజ్ చేసే మెచ్యూరిటీ అందరిలో రావాలి. అప్పుడే మన సినిమాల్లో ఎలాంటి తప్పులు మనకు కనిపించవు. సినిమాలో అన్ని రకాల సీన్లు పెడితేనే అది సంపూర్ణ సినిమా అవుతుంది. అంతే తప్ప ఇది చేయొద్దు.. అది చేయొద్దు అంటే అది సినిమా ఎలా అవుతుంది’’ అని వ్యాఖ్యానించింది. జాన్వీ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే జాన్వీ(Janhvi Kapoor) ఇప్పటి వరకు బోల్డ్ సీన్స్ చేయలేదు.
Read Also: పని గంటలపై దీపిక మరోసారి హాట్ కామెంట్స్

