టీమిండియా మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మందానా(Smriti Mandhana) సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. విశాఖపట్నం వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లోనే ఈ రికార్డ్ సాధించింది భారత ఓపెనర్. వర్షం కారణంగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ కాస్తంత ఆలస్యంగా ప్రారంభమైంది. ఇందులో టాస్ గెలిచి భారత్.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్‌గా క్రీజ్‌లోకి వచ్చిన స్మృతి.. 23 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టింది. చేసింది తక్కువ స్కోరే అయినా ఆమె ఓ రికార్డ్ నమోదు చేయడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 23 పరుగులకే ఔట్ అయిన స్మృతి.. మహిళల వన్డే క్రికెట్‌లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలచింది. మొత్తం 17 ఇన్నింగ్స్ ఆడి 982 పరుగులు చేయడంతో స్మృతి ఈ రికార్డ్‌ను సొంతం చేసుకుంది.
ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు వీరే..
Smriti Mandhana (భారత్) – 982 (2025)
బెలిండా క్లార్క్ (ఆస్ట్రేలియా) – 970 (1997)
లారా వోల్వార్డ్ట్ (సౌతాఫ్రికా)- 882 (2022)
డెబ్బీ హాక్లీ (న్యూజిలాండ్) – 880 (1997)
అమీ సాటర్త్‌వైట్ (న్యూజిలాండ్) – 853 (2016)
Read Also: మూవీ ప్రమోషన్‌కి రూ.15 లక్షలు.. తప్పేమీ కాదన్న నిహారిక

