కలం, వెబ్‌డెస్క్: అత్యాధునిక వందే భారత్ స్లీపర్ (Vande Bharat Sleeper) వచ్చే వారం పట్టాలపై పరుగు పెట్టనుంది. కోల్‌కతా–గౌహతి మధ్య ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేయనుంది. ఈ క్రమంలో వందే భారత్ స్లీపర్‌కు సంబంధించి భారత రైల్వే అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ రైల్లో టికెట్ల బుకింగ్‌కు వెయిటింగ్ లిస్ట్, ఆర్ఏసీ కేటగిరీలను తొలగించింది. కేవలం కన్ఫార్మ్డ్ టికెట్స్ మాత్రమే ఇవ్వనుంది. ఈ మేరకు రైల్వే శాఖ ప్రతిపాదన రూపొందించింది.
టికెట్ కన్ఫామ్ అయితే జర్నీ..
వందే భారత్ స్లీపర్ లో నో వెయిటింగ్ లిస్ట్, నో ఆర్ఏసీ నిర్ణయంతోపాటు ఇందులో ప్రయాణానికి ఛార్జీలను రైల్వే సిద్ధం చేసింది. దీని ప్రకారం.. కనీస ఛార్జీ వసూలు చేయడానికి తీసుకున్న పరిధి 400 కి.మీ. అంటే ఇందులో ప్రయాణికులు దిగాల్సిన స్టేషన్ 400 కి.మీ లోపలే ఉన్నా, ఛార్జీ మాత్రం 400 కి.మీలకు చెల్లించాల్సిందే. అలాగే ఆర్ఏసీ/వెయిటింగ్ లిస్ట్/పార్షియల్లీ కన్ఫార్మ్డ్ టికెట్ కేటగిరీలను తీసేయడంతో అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ మొదలైన రోజు(60 రోజుల ముందు) నుంచే అన్ని బెర్త్లూ అందుబాటులో ఉంటాయి. అంతేకాదు, టికెట్ కన్ఫామ్ అయిన వాళ్లకు మాత్రమే జర్నీకి అనుమతి ఇస్తారు. మహిళలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ కోటా ఎప్పటిలాగే ఉంటుంది. ఇతర కోటాలు ఉండవు. టికెట్ డిజిటల్ రూపంలోనే తీసుకోవాలి. అలాగైతేనే టికెట్లు క్యాన్సిల్ చేసినప్పుడు రీ ఫండ్ 24 గంటల్లో పూర్తవుతుంది. 45 ఏళ్ల పైబడిన స్త్రీలకు, 60 ఏళ్లు దాటిన మగవాళ్లకు ఆటోమేటిక్‌గా కింది బెర్త్‌లను సిస్టమ్ కేటాయిస్తుంది.
కి.మీకు ఛార్జీ ఇలా..
థర్డ్ ఏసీ – రూ.2.4
సెకండ్ ఏసీ – రూ.3.1
ఫస్ట్ ఏసీ – రూ.3.8
కనీస పరిధి 400 కి.మీ ప్రకారం..
థర్డ్ ఏసీ – రూ.960
సెకండ్ ఏసీ – రూ.1,240
ఫస్ట్ ఏసీ – రూ.1,520
- ఈ ధరలకు జీఎస్టీ అదనం.
- దేశంలో ప్రస్తుతం సీఎస్ఎంటీ–ఢిల్లీ మధ్య తిరుగుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో థర్డ్ ఏసీకి–రూ.2.10; సెకండ్ ఏసీకి–రూ.2.85, ఫస్ట్ ఏసీకి–రూ.3.85 చొప్పున ఛార్జీ చేస్తున్నారు. ఈ ప్రకారం వందే భారత్ స్లీపర్ (Vande Bharat Sleeper) ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.
Read Also: వచ్చే నెలలో పెళ్లి.. అమెరికా చెరలో నేవీ ఆఫీసర్ బందీ
Follow Us On: Sharechat


