కలం, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వ అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu) సీరియస్ అయ్యారు. కేంద్ర నిధుల వినియోగంపై అధికారులు సరిగ్గా పనిచేయట్లేదని మండిపడ్డారు. ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇందులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘కేంద్ర ప్రయోజిత పథకాల నిధులను ఖర్చు పెట్టాలని ఎన్ని సార్లు చెప్పినా లైట్ తీసుకుంటున్నారు. ఇలా అయితే కుదరదు. అన్ని శాఖల వారు ఈ నెలాఖరులోగా 100 శాతం నిధులు ఖర్చు చేసి.. మార్చి 15 వరకు ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి నిధులు తేవాలి. లేదంటే మీ ఫెయిల్యూర్ గానే చూస్తా. కార్యదర్శులు నిధులు ఖర్చు పెట్టడంలో పనితీరును మెరుగుపరుచుకోవాలి’ అంటూ మండిపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు.
మున్సిపల్ శాఖలో రూ.320 కోట్లు ఉంటే రూ.120 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని.. గిరిజన, హెల్త్, సంక్షేమ శాఖల్లోనూ నిధులు అలాగే ఉన్నాయని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ధనాన్ని మురిగిపోయేలా చేసే హక్కు ఎవరిచ్చారంటూ మండిపడ్డారు. తాను ఇంత సీరియస్ గా సమీక్షలు పెడుతుంటే ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదని సీఎం చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. కొత్తగా వచ్చిన మంత్రులు తమ శాఖల పరిధిలోని అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనుల్లో వేగం పెంచాలన్నారు. ఇలాగే వ్యవహరిస్తే పోస్టింగుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. అమరావతిలో రైతులను అభివృద్ధిలో భాగస్వాములను చేస్తూ ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. త్వరలోనే అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్స్ ప్రారంభిస్తానని స్పష్టం చేశారు.

Read Also: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్ట్‌లో ఎదురుదెబ్బ!
Follow Us On : WhatsApp


