కలం, సినిమా : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మన శంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu) సినిమా నేడు (జనవరి 12) థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అయితే ఆదివారం రాత్రే హైదరాబాద్ లో ప్రీమియర్ షోస్ పడ్డాయి. ప్రీమియర్ షోస్‌ను సినీ ప్రియులు, ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా చూశారు. ప్రీమియర్ షోస్ చూసిన వారంతా సినిమా బాగుందనే పాజిటివ్ టాక్ ఇవ్వడంతో మూవీ టీమ్ సంబరాలు స్టార్ట్ చేసింది. ప్రీమియర్స్ పూర్తవగానే మెగాస్టార్, డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi), నిర్మాత సుస్మిత (Sushmita), ఇతర టీమ్ మెంబర్స్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కేక్ కట్ చేసి సినిమా హిట్ అయిన హ్యాపీనెస్ షేర్ చేసుకున్నారు.
సంక్రాంతి సినిమాకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌తో పాటు మెగా కామెడీ టైమింగ్, వెంకీ గెస్ట్ రోల్ మ్యాజిక్, పాటలు, ఫైట్స్, ఎమోషన్స్ అన్నీ ఈ మూవీలో బాగా కుదిరాయని సినిమా చూసిన వాళ్లు చెబుతున్నారు. సినిమాను టెక్నికల్ గా మంచి క్వాలిటీతో రూపొందించడంలో దర్శకుడు అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడనే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ దర్శకుడు మరో సంక్రాంతి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడని అనుకోవచ్చు.
మెగాస్టార్ నుంచి ఇలాంటి పండుగ హిట్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. చిరు గత సినిమాలు ఆశించినంతగా ఆదరణ పొందలేదు. ఆ లోటును మన శంకరవరప్రసాద్ తీర్చినట్లయింది. ఈ సినిమా (Mana Shankara Varaprasad Garu) ప్రీమియర్స్ చూసిన వారిలో దిల్ రాజు (Dil Raju) ఉన్నారు. ఆయన తనే అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన దర్శకుడు అనిల్ రావిపూడిని మన శంకరవరప్రసాద్ సినిమా పూర్తయ్యాక అభినందించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈరోజు మార్నింగ్ షో నుంచి అన్ని ఏరియాల్లో హిట్ టాక్ సొంతం చేసుకుంది. మరి.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుందో.. ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి.
Cherishing moments with Megastar chiranjeevi
for team #ManaShankaraVaraPrasadGaru the BIGGEST FAMILY ENTERTAINER of Sankranthi 2026 in cinemas 📷#MegaBlockbusterMSG IN CINEMAS NOW 📷 ❤️#ManaShankaraVaraPrasadGaru #AnilRavipudi #megastarchiranjeevi #Kalam #Kalamdaily #kalamtelugu pic.twitter.com/9FfFH6r4Lv— Kalam Daily (@kalamtelugu) January 12, 2026
Read Also: “నేను రెడీ” అంటున్న హవిష్
Follow Us On: Sharechat


