కలం, నిజామాబాద్ బ్యూరో: ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఓ యువకుడి ఫొటోలను మార్ఫింగ్ చేసిన ఘటన నిజామాబాద్ (Nizamabad) జిల్లా రెంజల్ మండలంలో జరిగింది. కూనేపల్లి గ్రామానికి చెందిన కిష్టయ్య-సావిత్రి దంపతుల 28 ఏళ్ల కుమారుడు సంజయ్ ఉన్నాడు. కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్ (Online Betting)కు బానిసై, అప్పుల పాలయ్యాడు. అప్పులు చెల్లించాలని బెట్టింగ్ ముఠా ఒత్తిడి చేయడంతో రూ. రెండున్నర లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత మరో రూ.40 వేలు అప్పు చేసి చెల్లించాడు.
అయినా అప్పు తీరలేదు. మిగతా డబ్బు ఇవ్వాలంటూ ముఠా సభ్యులు సంజయ్ ఫొటోలను మార్పింగ్ చేశారు. పేరెంట్స్ ఫొటోలు కూడా మార్ఫింగ్ చేస్తామని బెదిరించడంతో సంజయ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రెంజల్ ఎస్సై చంద్రమోహన్ వెల్లడించారు.

Read Also: గిగ్ వర్కర్లకు గుడ్‌న్యూస్.. 10 నిమిషాల ఆన్‌లైన్ డెలివరీ ఎత్తివేత
Follow Us On: Instagram


