కలం, మెదక్ బ్యూరో : మెదక్ (Medak) జిల్లాలోని అడవి ప్రాంతాల్లో వన్యప్రాణులకు వేటాడుతున్న పది మందిని అటవీశాఖ అధికారులు. వారి నుండి వన్యప్రాణులను వేటాడేందుకు ఉపయోగించే వలలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల, దంతేపల్లి గ్రామాలలో ఫారెస్ట్ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.
దంతపల్లి గ్రామంలో ఒక ఇంట్లో అడవి జంతువు మాంసం విక్రయిస్తున్నారన్న సమాచారంతో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కుతుబుద్దీన్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో అడవి జంతువు సాంబ మాంసంను స్వాధీనం చేసుకున్నారు. చాకలి స్వామి అనే వ్యక్తిని అదుపులో తీసుకోగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు తెలిసింది. మాంసంతో పాటు చాకలి స్వామిని మెదక్ ఫారెస్ట్ కార్యాలయానికి తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. వన్యప్రాణులను వేటాడితే చట్టప్రకారం చర్య తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.


