నిజామాబాద్ లో డిగ్రీ, పీజీ ఇంజనీరింగ్ కాలేజీలు బంద్

కలం, నిజామాబాద్ బ్యూరో : రాష్ట్ర బడ్జెట్లో పెండింగ్ లో ఉన్న 10 వేల కోట్ల బకాయిలను విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ (Nizamabad) నగరంలో ప్రైవేట్ డిగ్రీ, పీజీ, బీఎడ్ కళాశాలలు స్వచ్ఛందంగా బంద్ చేశారు. పిడిఎస్‌‌యూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపులో భాగంగా జిల్లాలోని కాలేజీలు పాల్గొన్నాయి. రాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాల, కాకతీయ ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో పిడిఎస్యూ నాయకులు వెళ్లి బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పిడిఎస్‌‌యూ నగర అధ్యక్షుడు సిర్రం పవన్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్లో విద్య రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు.

విద్యారంగ అభివృద్ధికి 15 శాతం నిధులు కేటాయిస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చి.. బడ్జెట్ లో మాత్రం తక్కువ శాతం నిధులే కేటాయించిందని ధ్వజమెత్తారు. పెండింగ్ లో ఉన్న 10 వేల కోట్లు విడుదల చేయకపోవడం వలన విద్యార్థులకు ప్రైవేట్ యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వలన పై చదువులు, ఉద్యోగాలకు విద్యార్థులు వెళ్లలేక వారి భవిష్యత్ గందరగోళ పరిస్థితుల్లో పడుతుందన్నారు. సంక్షేమ పథకాల మీద ఉన్న దృష్టి విద్యార్థులు చదువుకునే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ మీద ఉండాలని హితవు పలికారు. నిధులు విడుదల చేయకపోతే భవిష్యత్తులో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్‌‌యూ జిల్లా (Nizamabad) నాయకులు మనోజ్,నగర నాయకులు దత్తు,గంగ సోనీ, శ్రీకర్, రాహుల్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: పీఆర్సీ అంశంలో ఉద్యోగులకు మళ్ళీ నిరాశే !!

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>